“వాలిమై” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. యంగ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. అజిత్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. వీరిద్దరో కాంబోలో వస్తున్న మూడవ చిత్రమిది. AK 61 వర్కింగ్ టైటిల్ తో కొత్త మూవీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో చెన్నైలోని, మౌంట్ రోడ్ కు సంబంధించిన భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడే బృందం సినిమాలోని ప్రధాన భాగాన్ని చిత్రీకరించనున్నారట. ఈ భారీ సెట్లలో ముఖ్యమైంది బ్యాంకు సెట్. సినిమా మొత్తం ఈ బ్యాంకు చుట్టూ తిరుగుతుంది.
Read Also : KGF 2 Press Meet At Tirupati : స్టోరీ ఇదేనట… రివీల్ చేసిన హీరో!
బ్యాంకు రాబరీ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్లను ఇంకా ఖరారు చేయలేదు మేకర్స్. టబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లను సంప్రదించినట్లు పుకార్లు రాగా, మేకర్స్ వాటిని కొట్టిపారేశారు. హైదరాబాద్ లోనే దాదాపు రెండు నెలల పాటు AK 61 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక ఇప్పటికే అజిత్ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు సినిమా లాంచ్ జరగనుంది. AK61కి నీరవ్ షా సినిమాటోగ్రాఫర్, జిబ్రాన్ సంగీతం, సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రఫీని అందించనున్నారు.ఇక ఈ సినిమాను బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.