Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ సినిమా పరిశ్రమకు భారీ ఊరటనిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో విడుదలయ్యే అన్ని తమిళ చిత్రాలకు, అవి విడుదలైన మొదటి 7 రోజుల పాటు రోజుకు 5 షోస్ ప్రదర్శించేలా ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమా థియేటర్ల మనుగడను, ఇండస్ట్రీ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై కోలీవుడ్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నూతన జీవో (GO) ప్రకారం తమిళనాడు సినీ రంగానికి మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తెల్లవారుజామున ప్రదర్శించే స్పెషల్ షోస్ కు ఇకపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వీటికి లైన్ క్లియర్ చేసింది. సినిమా విడుదలైన మొదటి వారం రోజులు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తమ పెట్టుబడిని త్వరగా రికవరీ చేసుకునేందుకు వీలుగా టికెట్ల ధరలను పెంచుకునేందుకు కూడా విజయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో తమిళనాడులో పెద్ద సినిమాలకు మాత్రమే ప్రత్యేక షోలు లేదా అదనపు షోలకు అనుమతి ఇచ్చేవారు. దానికోసం నిర్మాతలు ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీఎం విజయ్ ఏకంగా అన్ని తమిళ సినిమాలకు మొదటి వారం పాటు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కల్పించడంతో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా పరిశ్రమ మొత్తానికి ఇది పెద్ద వరంలా మారింది. ఈ నిర్ణయంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
తాజావార్తలు
-
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
-
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
-
Bihar: ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్‌కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!