Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది.సింహభాగం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్లో సరికొత్త లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకొని, షూటింగ్ ని పూర్తి చేసుకుంది. యువతని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరిలో తిరగబడరా సామీ రిలీజ్ కాబోతుంది.
ఇక రాజ్ తరుణ్.. నాగార్జున నటిస్తున్న నా సామీ రంగా సినిమాలో కూడా నటిస్తున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి రానుంది. ఇది కూడా రాజ్ తరుణ్ కు మంచి సినిమానే అని చెప్పాలి. సంక్రాంతికి ఈ సినిమా హిట్ అందుకుంటే.. రాజ్ తరుణ్ కు మంచి హిట్ పడినట్టే. వచ్చే నెల తిరగబడరా సామీ పై అంచనాలు ఉంటాయి. ఈ ఏడాది రాజ్ తరుణ్ కు సామీ బాగా సెట్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
