Tillu Square: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిద్దు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచో రెండో సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. రాధిక.. రాధిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ మిరియాల సంగీతం వహించిన ఈ సాంగ్ వేరే లెవల్ ఉండబోతుందని తెలుస్తోంది.
Manchu Manoj: ఆస్తి గొడవలు.. మంచు బ్రదర్స్ మధ్య మాటలు లేవు..?
రాధికా అనేది కేవలం పేరు మాత్రమే కాదని తెలుపుతూ.. ఇందులో అనుపమ పేరు కూడా రాధికనే అని కన్ఫర్మ్ చేసారా.. ? లేక రాధికను మర్చిపోలేని టిల్లు.. అనుపమలో రాధికను చూస్తున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ అయితే.. భలే క్రేజీగా ఉన్నాయి.. ” నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ బొంగుల మాటలు విని పడిపోయానే.. రంగుల కోక తాకి పడిపోయానే.. నీ గాలి సోకి నేను చచ్చిపోయానే..” అంటూ టిల్లు గాడు డ్యాన్స్ స్టెప్స్ వేసి అదరగొట్టాడు. అసలు ఆ సాంగ్ వింటేనే ఎవరికైన డ్యాన్స్ వేయాలి అనేంతలా మ్యూజిక్ ను ఇచ్చాడు రామ్ మిరియాల. అతని గాత్రంలోనే అంత జోష్ ఉంటుంది. ఇక సిద్దు, అనుపమల రొమాన్స్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా అనుపమ .. ఎంతో సెక్సీగా ఈ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సిద్ధుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
