Tillu Square: అనుపమతో టిల్లుగాడి ఘాటు రొమాన్స్.. అదిరిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tillu Square: ప్రతి హీరోకు అతని కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ జీవితాన్ని మార్చిన సినిమా అంటే డీజే టిల్లు. ఆ సినిమాలో టిల్లుగా సిద్దు నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక తన కెరీర్ లో తనను స్టార్ గా చేసిన సినిమాకు సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. టిల్లు స్క్వేర్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Pushpa 2: ‘పుష్ప 2’ లో శ్రీలీల ఐటెంసాంగ్.. ?
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
- Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. 'పెద్ది' ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
టికెట్ ఏ కొనకుండా అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “టిల్లు అన్న డీజే పెడితే” పాట లాగానే, “టికెట్ ఏ కొనకుండా” పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ కు రామ్ మిరియాల అందించిన సంగీతంతో పాటు ఆయనే స్వయంగా పాడడం మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఇక వీడియోలో అనుపమతో సిద్దు రొమాన్స్ మహా ఘాటుగా ఉంది. రొమాన్స్ కు, అందాల ఆరబోతకు దూరంగా ఉండే అనుపమ.. ఈ సినిమాలో హద్దులు చెరిపేసింది. టిల్లుతో రొమాన్స్ కు రెడీ అనడమే కాకుండా అందాల ఆరబోత కూడా చేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!