Raviteja: టైగర్ నాగేశ్వరరావు కొత్త ప్రయోగం..మొట్టమొదటి సారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswara Rao Will Also Release In Indian Sign Language On October 20th: మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ సినిమాను స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌పై భారీగా ఖర్చు చేస్తూ, సినిమాపై ఉత్సాహం నింపేందుకు నిర్మాత అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే మేకర్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Leo movie: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్న నాగవంశీ!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఆ వీడియోలో ఒక యాంకర్ క్లిప్ కంటెంట్‌ను వివరిస్తున్న విషయం వైరల్ అయింది. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే కాగా ఇప్పుడు అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలైయ్యే మొదటి ఇండియన్ మూవీగా నిలవనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ఆ రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఆర్ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ గా వ్యవరిస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో విడుదల కానుండగా ఒకరోజు ఆలస్యంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..