కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గతనెలలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎంపురాన్ రిలీజ్ అయి నెల కాకుండానే మరో సినిమా రిలీజ్ చేసాడు మోహన్ లాల్.
Also Read : Samyuktha : వడ్డీతో సహా చెల్లించేందుకు రెడీ అయిన మలయాళ భామ
తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తుడరుమ్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. అలనాటి అందాల నాయకి శోభన ఈ సినిమాలో మోహన్ లాల్ కు జోడిగా నటించింది. ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్బ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయిన ఒకరోజు తర్వాత రిలీజ్ అయింది. ఎవువంటి ప్రొమోషన్స్ లేకుండా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. గడిచిన శుక్రవారం దాదాపు డజను సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా తుడరుమ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ షోస్ తో నడిచాయి. దృశ్యం తరహా కథ, కథనాలు ఆడియెన్స్ ను మెప్పించాయి. మోహన్ లాల్ నటన, శోభన అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉన్న ఈ సినిమా ఫైనల్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టేందుకు ఛాన్స్ ఉంది. అటు కేరళలో రికార్డు స్థాయి కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది తుడరుమ్.
