Samyuktha : వడ్డీతో సహా చెల్లించేందుకు రెడీ అయిన మలయాళ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది అమ్మడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.
Also Read : OTT : ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
2023 లో వచ్చిన డెవిల్ తర్వాత కనిపించకుండా పోయింది సంయుక్త. గతేడాది సంయుక్త నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఇప్పుడు అమ్మడు గట్టిగానే ప్రయత్నిస్తోంది. వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది. ప్రజెంట్ సంయుక్త చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో మూడు మైథాలజీతో లింక్ ఉండే కావడం గమనార్హం. నిఖిల్ సిద్దార్థ్‌తో చేస్తోన్న స్వయంభు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైంధవ, బాలకృష్ణ అఖండ 2, తాండవం మైథాలజీ డ్రామాకు చెందిన సినిమాలుగా తెలుస్తోంది. ఇవే కాకుండా శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారీతో పాటు హిందీలో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ అనే మూవీ చేస్తోంది నందిని. నారీ నారీ నడుమ మురారి ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అఖండ 2 సెప్టెంబరు లో రానుంది. ఈ ఏడాదిలో సంయుక్త నుండి నాలుగైదు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. గతేడాది వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాది వడ్డీతో సహా తేర్చేందుకు రెడీ అయింది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!