హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ మేరకు ప్రచారపర్వం వేగం అందుకుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మారుతీ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే రావు రమేష్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇతర పాత్రలను పేరున్న నటీనటులే పోషించారు. అయితే ఈ సినిమాలో సోలో హీరోయిన్లుగా నటించిన ముగ్గురు అందాల భామలూ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం.
గత ఏడాది ‘క్రాక్’ మూవీలో ప్రతినాయిక పాత్ర పోషించి తెలుగు వారందరి దృష్టి తన మీద పడేలా చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనబడనుంది. అలానే ‘రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన చిత్ర శుక్లా ఇందులో ఓ కీ రోల్ ప్లే చేసిందని తెలుస్తోంది. ఇక పూరీ జగన్నాథ్ ‘నేనింతే’, క్రిష్ ‘వేదం’ సినిమాల్లో నటించిన శ్రియా గౌతమ్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ కు ‘పక్కా కమర్షియల్’తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ ముగ్గురు అందాల భామలు పోషిస్తున్న పాత్రలు ఏమిటనేది దర్శకుడు మారుతీ ఇంతవరకూ రివీల్ చేయడం లేదు. ట్రైలర్ లోనూ వీరిని చూపించలేదు. ఏదేమైనా వీరు ముగ్గురూ ఈ చిత్రంలో కీలక పాత్రల్లోనే కనిపిస్తారని తెలుస్తోంది. సో… ‘పక్కా కమర్షియల్’ కు రాశిఖన్నాతో పాటు మరింత గ్లామర్‌ను ఈ ముగ్గురితో మారుతి యాడ్ చేయబోతున్నారు.
