Site icon NTV Telugu

Tollywood : మూడు సినిమాలే చేసినా.. టాప్ క్లాస్‌గా నిలిచిన ముగ్గురు డైరెక్టర్స్

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో..

సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్‌ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఎమోషన్‌ ‘కబీర్ సింగ్‌’గా బాలీవుడ్‌లో రిపీట్ అయ్యింది. ‘యానిమల్‌’తో అయితే మాస్‌, క్లాస్‌ రెండింటినీ కలిపి బాక్సాఫీస్‌ షేక్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ అంటే వంగా స్టైల్‌లో మరో హై వోల్టేజ్‌ ఎమోషనల్ యాక్షన్ స్టార్మ్ రాబోతోంది. సందీప్ వంగా 8 ఏళ్ల కెరీర్ లో చేసినవి 3 సినిమాలే అయినా టాప్ క్లాస్ డైరెక్టర్ అనిపించుకుంటున్నాడు.

Also Read : RAPO : రామ్ – భాగ్యశ్రీ.. లవ్ కన్ఫమ్ చేసిన ‘చౌ మామ’..

నాగ అశ్విన్ : 10 ఏళ్ల కెరీర్‌లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసినా, ప్రతి సినిమా ఒక సిగ్నేచర్‌ క్రాఫ్ట్‌లా నిలిచింది. 2015 లో ‘ఎవడే సుబ్రమణ్యం’తో లైఫ్ ఫిలాసఫీ, ‘మహానటి’లో మ్యాజిక్‌ బయోపిక్‌, ‘కల్కి 2898 AD’లో ఫ్యూచర్ మైథాలజీ చూపించాడు.. ఇప్పుడు కల్కి సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న సినిమా ప్రేమికులందరికీ హోప్‌ ఫుల్ గా మారాడు.

సుజీత్ : 24 ఏళ్ల వయసులోనే 2014 లో ‘రన్ రాజా రన్’తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు సుజీత్‌. రెండో సినిమా తోనే బాహుబలి లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రభాస్ తో ఆఫర్ కొట్టేశాడు. ‘సాహో’తో పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా రైజ్‌ అయ్యాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’లో తన విజన్‌ చూపించాడు, తాజా గా నాని తో నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. 11 ఏళ్ల సినీ కెరీర్ లో సుజీత్‌ పేస్‌ స్లోగా ఉన్నా, ప్రెజెంటేషన్‌ మాత్రం సూపర్‌ ఫాస్ట్‌ అంటున్నారు సినీ లవర్స్.

Exit mobile version