Oscar 2023: ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమా ఆస్కార్ బరిలో 11 నామినేషన్స్ సంపాదించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఆస్కార్ లో ఢీ అంటే ఢీ అంటూ సాగుతోన్న ‘ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్’ బ్రిటిష్ ఆస్కార్స్ గా భావించే ఫిలిమ్ అవార్డ్స్ లో ఎక్కువ కేటగిరీల్లో విజేతగా నిలచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రెండు చిత్రాల నేపథ్యం అమెరికాకు చెందిన కథలు కాకపోవడం గమనార్హం! చిత్రమేమిటంటే ఈ రెండు సినిమాలు ‘బెస్ట్ పిక్చర్’ విభాగంలో చోటు దక్కించుకున్నాయి. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ కేటగిరీలోనూ ‘ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్’ స్థానం సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలపైనే చాలామంది దృష్టి సాగుతోంది. రెండు సినిమాలూ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందినవే! అందువల్లే ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్స్ లభించాయనీ పరిశీలకుల మాట. ఈ రెండు సినిమాలకూ అకాడమీ సభ్యులు న్యాయం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బెస్ట్ పిక్చర్ విభాగంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమాకు ఓటు వేసేవారంతా, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీలో ‘ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్’కు ఒటేసే దిశగా సాగుతున్నారనీ వినిపిస్తోంది.
Sobhita Dhulipala: నువ్వు దానికి కూడా పనికి రావు అన్నారు..
ఇదిలా ఉంటే, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ చిత్ర దర్శకులు డేనియల్ షేనెర్ట్, డేనియల్ క్వాన్ మాత్రం తాము గాల్లో తేలిపోతున్నామని చెబుతున్నారు. తొలిసారి ఆస్కార్ లంచన్ లో పాలు పంచుకున్న ఈ దర్శకులు ఇది నమ్మలేని నిజం అంటున్నారు. అమెరికా, బ్రిటన్ లో జన్మించిన డేనియల్స్ నిజానికి ఆసియా రూట్స్ ఉన్నవారు. అందువల్ల ఈ 11 విభాగాల్లో తమ సినిమా ఏ అవార్డు సంపాదించినా,అది తమకెంతో గర్వకారణంగా ఉంటుందని చెబుతున్నారు. ‘ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్’ డైరెక్టర్ ఎడ్వర్డ్ బెర్గర్ కు ఆస్కార్ బరిలో బెస్ట్ డైరెక్టర్ గా నామినేషనే లభించలేదు. కానీ, బ్రిటిష్ అకాడమీ అవార్డ్స్ లో ఎడ్వర్డ్ బెస్ట్ డైరెక్టర్ గా గెలిచారు. అయితే ఆయన సినిమా ‘బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ సంపాదించింది. ఆ రెండింట ఏ కేటగిరీలో అవార్డు లభించినా, దర్శకునిగా కాకపోయినా ఆ సినిమా నిర్మాతగా ఎడ్వర్డ్ ఆస్కార్ వేదికపై వెలిగే ఆస్కారం ఉంది. ఇలా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ , ‘ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్’ చిత్రాలు ఈ సారి ఆస్కార్ బరిలో భలేగా ఆకర్షిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలకే అవార్డులు లభిస్తాయో, లేక వేరే చిత్రాలు విజేతలుగా నిలుస్తాయో చూడాలి.