Site icon NTV Telugu

Ashok Selvan: ‘ఆకాశం’లో ఆ ముగ్గురు!

Akasham

Akasham

 

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్. అతను హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌. ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆకాశం’ అనే సినిమా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్ట‌ర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

వ్య‌వ‌సాయం చేసే రైతు కుమార్తె మ‌తి పాత్ర‌లో అప‌ర్ణ బాల ముర‌ళి, కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో శివాత్మిక, ట్రావెలింగ్‌ను ఇష్ట‌ప‌డే అమ్మాయి శుభ పాత్ర‌లో రీతూవ‌ర్మ న‌టిస్తున్నారు. విశేషం ఏమంటే… గతంలోనూ అశోక్ సెల్వన్, రీతూవర్మ ‘నిన్నిలా నిన్నిలా’ మూవీలో నటించారు. ఈ తాజా చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Exit mobile version