ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుడు, ఫిల్మ్ బౌండరీలని చెరిపేసిన దర్శకుడు, రాజమౌళినే ఆశ్చర్యపరిచే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. కమర్షియల్ ఫార్మాట్ కి, టెంప్లెట్ సినిమాలకి సోషల్ మెసేజ్ అద్దితే అది శంకర్ సినిమా అవుతుంది. శంకర్ సినిమాలో హీరో అంటే సొసైటీ ఇష్యూని ప్రశ్నించాల్సిందే. అందుకే ఒకప్పుడు శంకర్ సినిమాలకి ఆడియన్స్ కనెక్టివిటి ఎక్కువగా ఉండేది. మళ్లీ తన వింటేజ్ ఫామ్ ని చూపించడానికి, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి శంకర్… చరణ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘RC 15’. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజులో హిట్ కొట్టి, శంకర్ అంటే ఏంటో మరోసారి అందరికీ గుర్తు చేస్తాడని ఆయన ఫాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఒకప్పుడు శంకర్ సినిమా చాలా పకడ్బంగీ షూటింగ్ జరిగేది. సెట్స్ నుంచి ఒక్క లీక్ కూడా బయటకి వచ్చేది కాదు, అందుకే సినిమాకి వెళ్లి చూడగానే ఆడియన్స్ ఆ విజువల్స్ ని చూసి థ్రిల్ అయ్యే వాళ్లు. హీరో లుక్ కి విజిల్స్ వేసే వాళ్లు.
ఇప్పుడు శంకర్ సినిమా పరిస్థితి ఇలా లేదు, శంకర్ ఫ్రేమ్ పెడితే చాలు ఈవెనింగ్ షూటింగ్ అయ్యే లోపు ఆరోజు షూటింగ్ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? సెట్స్ లో ఎవరెవరు ఉన్నారు? చరణ్ లుక్ ఏంటి? చరణ్ పక్కన ఎవరు నటిస్తున్నారు? ఇలా ప్రతి విషయం లీక్ అయిపోతుంది. చరణ్ విలేజ్ లుక్, శ్రీకాంత్ లుక్, చరణ్ పొలిటికల్ పార్టీ, చరణ్-ట్రాఫిక్ కానిస్టేబుల్ సీన్, రాజీవ్ కనకాలా సీన్, అంజలి క్యారెక్టర్, తాజాగా వాల్తేరు వీరయ్య రిఫరెన్స్. ఇలా ఒకటేంటి అవకాశం ఇవ్వలేదు కానీ ఫారిన్ షెడ్యూల్ పిక్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో లీక్ చేసే వాళ్లు. ఇంతకీ ఇన్ని లీక్స్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారా? అన్నీ అభిమానులే, అత్యుత్సాహంతో ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, అవి వైరల్ అవుతున్నాయి. శంకర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీకులని ఆపలేకపోతున్నట్లు ఉన్నాడు, ఫ్యాన్స్ మాత్రం శంకర్ ఇచ్చే హైని ఈ లీకులతో పోగొట్టుకుంటున్నారు.