తమిళ దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అలాగే తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చెయడం కొత్తేమి కాదు. గతంలో ఎందరో దర్శకులు, హీరోలు ఆ విధంగా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ప్లాప్ సినిమాలు ఇస్తే.. తెలుగు హీరోలు మాత్రం తమిళ హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ అందించారు. అందుకు కొన్ని ఉదాహరణలు…
తమిళ దర్శకులు – తెలుగు హీరోలు :
AR మురుగదాస్ : కోలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా చలామణి అవుతున్న రోజుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన సినిమా స్పైడర్. 2017లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
లింగుస్వామి : ఈ సీనియర్ తమిళ దర్శకుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేసిన వారియర్ కనీసం వారం రోజులు కూడా ఆడలేదంటే ఎంత ప్లాప్ అయింది అర్ధం చేసుకోవచ్చు
వెంకట్ ప్రభు : విభిన్న చిత్రాలకు పేరుగాంచిన ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్యకు ‘కస్టడీ’ అనే ప్లాప్ సినిమాను ఇచ్చాడు
శంకర్ : భారీ చిత్రాల దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలబడింది. అంతటి నాసిరకం సినిమా అందించాడు శంకర్.
ఇవే కాకుండా బాలయ్యహీరోగా KS రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ , SJ సూర్య దర్శకత్వంలో వచ్చిన కొమరం పులి అల్ట్రా డిజాస్టర్స్ అయ్యాయి.
తెలుగు దర్శకులు – తమిళ హీరోలు :
వెంకీ అట్లూరి : ఈ దర్శకుడు తమిళ హీరో ధనుష్ తో చేసిన ‘సార్’ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ధనుష్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ తెలుగు దర్శకుడు మలయాళ హీరో దుల్కర్ కు కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇచ్చాడు.
శేఖర్ కమ్ముల : సున్నితమయిన మనసును హత్తుకునే కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా కుబేర అనే క్రైమ్ డ్రామాను తెరకెక్కించాడు. నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.
వంశీ పైడిపల్లి : తమిళ స్టార్ విజయ్ తో వారసుడు అనే సినిమాను డైరెక్ట్ చేసిన వంశీ సూపర్ హిట్ సినిమా అందించాడు.
