పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెటప్ అంతా 90లలో ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు. అయితే, సినిమాలో ఒక ఎలివేషన్ సీన్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్, పవన్ కళ్యాణ్ మెడ రుద్దుకునే సీన్ చేసి చూపించారు.
Also Read:OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..
వాస్తవానికి, 90లలో పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశాడు, అది కూడా 1998లో. కానీ, అప్పటికి ఆయన మేనరిజం గురించి ఎవరికీ తెలియదు. కానీ, ఈ సినిమాలో మాత్రం దాన్ని చూపించారు. ఇది పెద్ద విషయమేమీ కాదు, కానీ ఇక్కడ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ గురించి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అది కామెడీగానే అయినా, ఇప్పుడు ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక, ఈ సినిమా మొదటి రోజు 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ఇప్పటికే టీం అధికారికంగా ప్రకటించింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
