Deeksha Seth: దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు. వేదం సినిమాలో కేబుల్ రాజు అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా దీక్షా అందరికి సుపరిచితమే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత సెకండ్ హీరోయిన్ గా మిరప కాయ్, రెబల చిత్రాల్లో దర్శనమిచ్చింది. ఇక ఈ సినిమాలు అమ్మడికి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. తరువాత హీరోయిన్ గా వాంటెడ్, నిప్పు, ఊ కొడతావా.. ఉలిక్కి పడతావా లాంటి సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో టాలీవుడ్ కు నిదానంగా దూరమైన అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారును పిచ్చెక్కించే పనిలో పడింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రెండేళ్ల క్రితం సోషల్ మీడియాకు కూడా బ్రేక్ ఇచ్చింది. దీంతో దాదాపు ఈ ముద్దుగుమ్మను అందరూ మర్చిపోయారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది దీక్షా.. రావడం రావడమే బికినీలో దర్శనమిచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసింది. బీచ్ లో బికినీ వేసుకొని హాట్ లుక్ లో దీక్షా మతులు పోగొడుతోంది. అయితే అప్పటికి, ఇప్పటికి దీక్షా ఒంపుసొంపులో మార్పు రాలేదు కానీ, ముఖం మాత్రం కొద్దిగా కళ తప్పినట్లు కనిపిస్తోంది. నిలువెత్తు పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న దీక్షా ఫోటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అరే.. వేదం హీరోయిన్ అంటూ టక్కున గుర్తుపట్టి.. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం దీక్షా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని సమాచారం. మరి అమ్మడికి అవకాశాలు వస్తాయా..? రావా..? అనేది తెలియాల్సి ఉంది.