Site icon NTV Telugu

‘రాధేశ్యామ్’ ట్రైలర్ లో హైలైట్ అవేనట..?

radheshyam

radheshyam

రాధేశ్యామ్.. రాధేశ్యామ్ .. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులందరు కలవరిస్తున్న పేరు. ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ని అభిమానుల చేత విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.

ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లో విజువల్స్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవనున్నాయట.. రాధేశ్యామ్ కథం చెప్తూనే విజువల్స్ ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేయనున్నాయట. ఇప్పటికే ఈ సినిమాలో విజువల్స్ ఏ లెవెల్లో చూపించారో ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ లో చూపించేసాడు దర్శకుడు. రిచ్ లొకేషన్స్ అంతకు మించి అదిరిపోయే విజువల్స్ తో ట్రైలర్ ని కట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్దిసేపటిలో ఈ విజువల్ ట్రీట్ రిలీజ్ కానుంది. మరి ఈ ట్రైలర్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version