బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న కంగనా డైరెక్టర్ లపై పలు వ్యాఖ్యలు చేసింది.
Also Read : Nithya Menen : సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న నిత్యామీనన్
మీరు ఏ దర్శకుడితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా కంగనా మాట్లాడుతూ ‘ మన చుట్టూ ఉన్న దర్శకుల తీరు నాకు నచ్చడం లేదు. నిజం చెప్పాలంటే మనకు గొప్ప దర్శకులు ఎవరూ లేరు. ఒకవేళ మంచి దర్శకులు ఉండి ఉంటే నేను దర్శకత్వం వైపు వచ్చుండేదాని కాదు. ఎవరిని తక్కువ చేయాలని ఇలా మాట్లాడటం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్న. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు అని నన్ను అడిగితే అలాంటి వారు ఎవరూ ఇప్పుడు భూమి మీద లేరు. భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకులు సైతం వారి సినిమాలో హీరోయిన్ పాత్రను అతి దారుణంగా చూపిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో నేను ఎంతోమంది కొత్త దర్శకులతో కలిసి వర్క్ చేశా. ఇప్పుడు బాలీవుడ్ లో మంచి సినిమాలు తీయడానికి దర్శకులు కరువైపోయారు. ఒకప్పుడు మా రక్తంలోనే యాక్టింగ్ ఉందనవళ్లందరూ ఇప్పుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అందుకే ఇటువైపు చూడటం లేదు’ అని కంగనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.