NTV Telugu Site icon

Nawazuddin Siddiqui: భార్యా పిల్లలను నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటేసిన స్టార్ నటుడు.. వీడియో వైరల్

Navaj

Navaj

Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా అతడి భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. నవాజుద్దీన్.. మొదటి భార్య నుంచి విడిపోయాక అలియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక తన భర్త పెళ్లి అయిన దగ్గరనుంచి తనను వేధిస్తున్నాడని, తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని ఆమె ఇటీవలే మీడియా ముందు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతడి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య వివాదం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే నవాజుద్దీన్ తన భార్యాపిల్లలను ఇంట్లో నుంచి గెంటేయడం సెన్సేషన్ గా మారింది. ముంబైలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటున్న నవాజుద్దీన్.. గతరాత్రి తన భార్య అలియా.. పిల్లలు యాని, షోరాను ఇంటి నుంచి గెంటేశాడు. నడిరోడ్డుపై నిలబడిన వారు ఒక వీడియో ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చారు.

Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..

” ఈ అర్ధరాత్రి నవాజ్ మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నా ఇద్దరు పిల్లల్తో నేను రోడ్డున పడ్డాను. నా కూతురు వాళ్ళ నాన్న ఇంటివైపు చూస్తూ ఏడుస్తోంది. నా దగ్గర రూ. 81 ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. నవాజ్ ఇలా చేస్తావని అనుకోలేదు. నిన్ను వదలను.. నన్ను, నా బిడ్డలను రోడ్డు మీద పడేశావ్.. ఖచ్చితంగా నేను నిన్ను వదలను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా వీడియోలో నవాజ్ కూతురు ఏడవడం ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది. ఇక ఈ వీడియో చూశాక నెటిజన్లు నవాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ.. ఇలా పిల్లలను రోడ్డుమీదకు లాగడం ఏంటి..? అని కొందరు..నీకు నీ భార్య నచ్చకపోతే ఆమెకు లీగల్ గా విడాకులు ఇచ్చి, వారికి భరణం చెల్లించి వారి బతుకు వారు బతికేలా చేయాలి కానీ, ఇంత దారుణంగా రోడ్డుమీదకు పడేస్తారా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలపై నవాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.