NTV Telugu Site icon

The Vaccine War: సలార్ పార్కింగ్ కలెక్షన్స్ అంత రాలేదు.. నీకెందుకు ప్రభాస్ తో పోటీ?

Vivek Agnihotri Prabhas

Vivek Agnihotri Prabhas

The Vaccine War box office collection: వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది . దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో దాన్ని కూడా క్రాస్ చేసేందుకు కష్టపడుతోంది. అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కీలక పాత్రలలో నటించిన ‘ది వ్యాక్సిన్ వార్’ థియేటర్లలో అంతగా ఆడడం లేదు. అక్టోబర్ 3న ఈ సినిమా కలెక్షన్స్ అయితే దారుణంగా నమోదయ్యాయి. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ₹ 9.5 కోట్లు, దేశంలో ₹ 7.72 కోట్ల నెట్ వసూలుచేసి, అందరికీ షాక్ ఇచ్చింది. రిలీజ్‌కు ముందు స్పెషల్ షోస్ ద్వారా ఎంతోమంది ప్రశంసలు పొందిన ఈ మూవీకి ఇంత తక్కువ కలెక్షన్ రావడం మూవీ యూనిట్‌కు మింగుడుపడలేదని అంటున్నారు.

Mansion 24: ఓంకారన్న.. ఏందీ అరాచకం.. వణికిస్తోన్న ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్

నిజానికి ఇదే దర్శకుడి మునుపటి సినిమా థి కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ₹ 341 కోట్లు, దేశంలో ₹ 252.25 కోట్లు నెట్ వసూల్ చేసింది, ఆ సినిమా దెబ్బకు ఈ సినిమా మీద కూడా జనాల్లో ఆసక్తి ఏర్పడింది కానీ రియాలిటీ విషయంలో పూర్తిగా తేడా కొట్టేసింది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. అయితే అప్పట్లో ఈ సినిమాను ప్రభాస్ సలార్ సినిమాకి పోటీగా దింపుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మధ్యలో ప్రభాస్ మీద వివేక్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అనుకోని కారణాలతో సలార్ పడింది. కానీ ఈ సినిమా కనుక అదే రోజున రిలీజ్ అయి ఉంటే సలార్ సినిమా ఓపెనింగ్ డే పార్కింగ్ కలెక్షన్స్ ఈ వ్యాక్సిన్ వార్ సినిమా మొదటి వారం కలెక్షన్స్ ను దాటిపోయేవని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే కన్నుమిన్ను కానక కామెంట్లు చేశాడు, ఇప్పుడేం అంటాడా అని వారు కామెంట్లు చేస్తున్నారు.