Site icon NTV Telugu

Star Hero : స్టార్ హీరో కొడుకు తిరిగొచ్చాడు.. ట్రైలర్ రిలీజ్ చేసాడు..

Pranav Mohanlal

Pranav Mohanlal

మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఫ్రెండ్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెసై తండ్రికి అమితమైన పుత్రోత్సాహాన్ని ఇస్తుంటే ప్రణవ్ మాత్రం కెరీర్ కాదు పర్సనల్ లైఫ్‌ ముఖ్యమని మొన్నటి వరకు స్పెయిన్‌లో గొర్రెలు, మేకలు కాస్తూ ఎంజాయ్ చేసి మళ్లీ ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.

ఫాదర్ నటించిన బర్రోజ్, ఎంపురన్‌లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ మళ్లీ ఫుల్ లెంత్ క్యారెక్టర్‌పై కాన్సట్రేషన్ చేస్తున్నాడు. ‘డైస్ ఇరాయ్’ అనే హారర్ థ్రిల్లర్ చేస్తున్నాడు. మమ్ముట్టి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బ్రహ్మయుగం ఫేం రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో డైస్ ఇరాయ్ చేస్తున్నాడు ప్రణవ్. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. మాలీవుడ్ నుండి మరో ఇంట్రస్టింగ్ హారర్ థ్రిల్లర్ రెడీ అవుతోంది. ఈ జోనర్‌లో నటించడం కూడా ప్రణవ్‪కు ఫస్ట్ టైం.  నైట్ షిఫ్ట్, వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న డైసీ ఇరాయ్ క్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక ఇదే నెలలో ఫాదర్ బైలింగ్వల్ ఫిల్మ్ వృషభ కూడా థియేటర్లలో సందడి చేయబోతుంది. అక్టోబర్ 16న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రమోషన్ల హడావుడి కనిపించడం లేదు. ఇలా ఫాదర్ అండ్ సన్ ఓకే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Also Read : Kantara Chapter1 : కాంతార చాప్టర్1 ఆడియెన్స్ రివ్యూ.. ‘శెభాష్ రిషబ్ శెట్టి’

Exit mobile version