Site icon NTV Telugu

STAR HERO : డైరెక్షన్ లో వేలుతో పాటు అన్ని పెట్టేస్తున్న స్టార్ హీరో

Toxic

Toxic

శాండిల్ వుడ్ స్టాండర్డ్స్‌ మార్చేసిన హీరో యశ్. వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్‌తో రూ. 250 కోట్లు కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చేతికి అప్పగించాడు. 2023లో స్టార్టైన ఈ మూవీ షూటింగ్ ఈ మధ్య క్లైమాక్స్‌కి చేరిందని సమాచారం. కానీ అదే టైంలో టాక్సిక్ షూటింగ్‌పై వస్తున్న వార్తలు ప్రాజెక్టుపై అంచనాలు తగ్గించేస్తున్నాయి.

Also Read : Jailer 2 : జైలర్ 2 రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్ రజనీ

ముంబయిలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టాక్సిక్ ఇప్పుడు బెంగళూరులో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పార్ట్ పట్ల యశ్ సంతృప్తిగా లేడన్నది టాక్. స్క్రిప్ట్ రీ రైట్ చేస్తున్నాడని, కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మేకింగ్ అండ్ టేకింగ్ పట్ల అసంతృప్తితో ఉన్నాడని టాక్‌. ఇప్పటికఏ కంప్లీట్‌ అయిన రెండు మేజర్ షెడ్యూల్స్ రష్‌ని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. టాక్సిక్ విషయంలో దర్శకురాలి పనిలో వేలు పెట్టి.. షూటింగ్ కంటే.. రీ షూట్స్ పై కాన్సట్రేషన్ చేస్తున్నాడట రాఖీ బాయ్. స్క్రిన్ ప్లేలో మార్పులు, చేర్పుల వల్ల షూటింగ్ డిలే అవుతోందట. ఇప్పటికే ఈ సినిమాపై 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టిందట కేవిఎన్ ప్రొడక్షన్స్. రుక్మిణీ వసంత్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ లాంటి బ్యూటీలు నటిస్తోన్న ఈ సినిమా అనుకున్న టైంలో షూట్ కంప్లీట్ కాకవడంతో నెక్ట్స్ ఇయర్ మార్చికి సినిమా రిలీజ్‌ కావడం డౌటే అని టాక్‌.

Exit mobile version