2022లో కరోన సమయంలో OTTలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో తమన్న ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు కెరీర్ లో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ‘ఓదెల2’ సినిమాలో అఘోరిగా నటించింది. ఇక ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నా టీజర్, తాజాగా ఈ రోజు మహా కుంభ మేళా సందర్భంగా, కాశీలో రిలీజ్ చేశారు. 1.52 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.
Also Read:Venkatesh: టెలివిజన్ ప్రీమియర్ సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
శివునికి తన జీవితాన్ని అంకితం చేసిన మంచి మనిషికి, ఓ ఆత్మకు మధ్య జరిగే కథగా ఈ ‘ఓదెల2’ తెరకెక్కినట్టు టీజర్‌లో అర్ధమవుతుంది. ఇక విజువల్స్ నుంచి చాలా మంచి షాట్స్ ను కట్ చేయగా, వాటిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింత థ్రిల్లింగ్ గా మరల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. ముఖ్యంగా శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో మంచి పాత్రలో కనిపించబోతుంది తమన్న. ఈ పాత్ర తన కెరీర్ గ్రాఫ్ ని మరింత పెంచుతుంది.మొదటి బాగంతో పోలిస్తే ఓదెల2 కోసం మెకర్స్ చాలా కష్టపడినట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. దీంతో మూవీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కథలపై ప్రేక్షకులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని బట్టి ఈ మూవీ కూడా భారీ విజయం అందుకోవడం ఖాయం.