Raashii Khanna: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ కృష్ణ దర్శకత్వంలో ది సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆగస్టు 15 న ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో అందరికి తెలుసు.. కానీ, వారి జ్ఞాపకాలతో వారి కుటుంబ సభ్యులు ఎలా బతుకుతున్నారు అనేది ఈ సాంగ్ లో చూపించారు. సత్య అనే యువతి.. తన భర్తను యుద్దానికి పంపి.. అతని జ్ఞాపకాలతో ఎలా జీవితాన్ని సాగించింది అనేది ఈ సాంగ్ లో చూపించారు. ఇక ఈ ఆల్బమ్ కు శృతి రంజనీ సంగీతం అందించడమే కాకుండా ఆమె ఆలపించింది. రిలీజ్ అయ్యాక ఈ ఆల్బమ్ మంచి సక్సెస్ ను అందుకుంది.
Nawazuddin Siddiqui: హిజ్రాగా మారిన వెంకటేష్ విలన్..
ఇక తాజాగా ఈ ఆల్బమ్ కు మరింత హైప్ ను అందించారు మేకర్స్. ఈ సాంగ్ ను హీరోయిన్ రాశీఖన్నా రీ క్రియేట్ చేసింది. సోల్ ఆఫ్ సత్య ఫీట్ రాశీఖన్నా వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాశీ హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ అన్న విషయం కూడా తెల్సిందే. ఇప్పటికే ఈ చిన్నది తన సినిమాల్లో రెండు సాంగ్స్ కూడా ఆలపించింది. ఆ అనుభవంతోనే.. సోల్ ఆఫ్ సత్యను ఆలపించింది. రాశీ వాయిస్ తో విన్న ఈ సాంగ్ మరింత అద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీని మిక్స్ చేసి రాశీ పాడిన విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.