Dhurandhar 2: ధురంధర్-2 క్లైమాక్స్ సాంగ్ వైరల్.. అసలెవరు ఈ “రాస్‌పుటిన్”, ఐఎస్ఐ అధికారి పాత్రతో సంబంధం ఏమిటి..?
- ధురంధర్ 2 క్లైమాక్స్‌లో ‘‘రస్‌పుటిన్’’ సాంగ్ వైరల్..
- అసలు ఈ సాంగ్‌కు పాక్ ఐఎస్ఐకి సంబంధం ఏమిటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: ‘‘ధురంధర్ 2’’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనేక రికార్డుల్ని తుడిచిపెట్టేస్తోంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవర్. ఇక ఆదిత్య ధర్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 3.30 గంటల కన్నా ఎక్కువ నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సినిమాను తెరకెక్కించారు. ధురంధర్ 1 తో పోలిస్తే ధురంధర్ 2 మరింత పెద్ద హిట్ సాధించింది.
ఇదిలా ఉంటే, సినిమా క్లైమాక్స్‌లో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఐఎస్ఐ ఇంటరాగేషన్ సమయంలో బోనీ ఎమ్ పాడిన ఫేమస్ సాంగ్ ‘‘రస్‌పుటిన్’’ వస్తుంది. అయితే, ఈ సాంగ్ పెట్టడంలో పెద్ద కథ ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఈ సాంగ్ ఐఎస్ఐ అధికారి లెఫ్టినెంట్ జనరల్ శంషాద్ హసన్ గురించి తెలుపుతుంది. ఈ సినిమాలో శంషాద్ హసన్‌గా రాజ్ జుత్షి నటించారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఆ సమయంలో తన కుర్రాని వదిలేయాలని ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ శంషాద్ హసన్‌ను అడుగుతారు. శంషాద్ హసన్‌కు ఇజ్రాయిల్‌కు ఉన్న సంబంధం బయటపెడతానని, పాకిస్తాన్‌లోని ప్రజలు నిన్ను కుక్కను కొట్టినట్లు కొడుతారని బెదిరిస్తారు. దీంతో చివరకు పాక్ ఐఎస్ఐ హమ్జా (రణ్‌వీర్ సింగ్)ను విడిచిపెడుతారు. షంషాద్ తనను ఏం చేయలేరని ముందుగా భావించినప్పటికీ, చివరకు తన బండారం బయటపడటంతో వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఇది సరిగా ‘‘రస్‌పుటిన్’’ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. అందుకే, క్లైమాక్స్‌లో ‘‘రస్‌పుటిన్’’ సాంగ్ వినిపిస్తుంది.
రస్‌పుటిన్ ఎవరు?
గ్రిగోరీ రాస్పుటిన్ 19వ శతాబ్దపు రష్యాలో ఒక శక్తివంతమైన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి సోవియట్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. జార్ నికోలస్ II ఆస్థానంలో శక్తివంతమైన ఆధ్యాత్మికవేత్త, వైద్యుడిగా ఎదిగాడు. హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న మహారాజు కుమారుడిని నయం చేసినట్లు నటిస్తూ, మహారాణి అలెగ్జాండ్రా నమ్మకాన్ని సంపాదించి. తెరవెనక రాజకీయాల్లో కీలకంగా మారుతాడు.
అపరిమిత అధికారంతో రాజు నిర్ణయాలను రస్‌పుటిన్ ప్రభావితం చేశాడు. కొన్ని సందర్భాల్లో లంచం తీసుకుని కూడా రాజ నిర్ణయాలను మార్చాడు. అధికారం తలకెక్కి మత్తులో మునిగితేలాడు. వేశ్యలు, ఉన్నతవర్గీయులు, చివరకు రాజసభ మహిళలో సంబంధాలు పెట్టుకున్నాడు. రష్యన్ ఉన్నత వర్గాలు ఇతడిని ప్రమాదకర వ్యక్తిగా చూశారు.
చివరకు ఇతడికి 1916లో చంపేశారు. ఈ హత్య చరిత్రలో ఒక కీలకాంశంగా మిగిలింది. ముందుగా సైనైడ్ కలిపిన కేకులు తినిపించారు. అది విఫలం కావడంతో అతడిపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మరణించాడని కన్ఫామ్ అవ్వకపోవడంతో గడ్డకట్టించే నేవా నదిలో పడేశారు. అయితే, డాక్టర్ డిమిత్రి కోసోరోటోవ్ నిర్వహించిన శవపరీక్షలో రాస్‌పుటిన్ శరీరంలో విషం ఆనవాళ్లు కనిపించలేదు. తాను బలవంతుడినని నమ్మిన రస్‌పుటిన్ చివరకు హత్య చేయబడ్డాడు.
ధురంధర్ సినిమాలో కూడా ఐఎస్ఐ అధికారి షంషాద్ భారత్ తమను ఏం చేయలేదని, ఇంటర్నేషనల్ మీడియా ముందు హమ్జాను భారత ఏజెంట్‌గా చూపించాలని ప్రయత్నిస్తాడు. చివరకు పాక్ అణు సమాచారాన్ని ఇజ్రాయిల్‌కు అమ్ముతూ కనిపించిన షంషాద్ వీడియోను సచిన్ సన్యాల్(మాధవన్) పంపించడంతో కథ అడ్డం తిరుగుతుంది.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!