‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘సహనా.. సహనా’ పూర్తి పాటను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ అప్‌డేట్ ఇచ్చారు.
Also Read: IND vs SA: శుభ్‌మన్ గిల్ ఔట్.. సంజూ శాంసన్ టార్గెట్ టీ20 వరల్డ్ కప్!
‘రాజా సాబ్’ స్పెషల్ ప్రీమియర్స్ జనవరి 8న వేయబోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ ఓపెన్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈవెంట్‌కు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెండి తెరపై తమ డార్లింగ్‌ను ఒకరోజు ముందుగానే వీక్షించని ఆనంద పడిపోతున్నారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా రాజా సాబ్ తెరకెక్కింది.
