Site icon NTV Telugu

The RajaSaab : ఆ రెండు ఔట్.. రాజాసాబ్‌కు ఎదురే లేదు

Tollywood

Tollywood

జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ నుంచి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఙప్తితో పాటు.. నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు రాజాసాబ్‌తో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, రాజాసాబ్‌కు తెలుగుతో పాటు తమిళ్‌లోను గట్టి కాంపిటీషన్ ఉంది.

Also Read : JanaNayagan : విజయ్ జననాయగన్ రిలీజ్ వాయిదా… అసలు కారణం ఏంటి?

విజయ్ చివరి చిత్రంగా చెబుతున్న ‘జననాయగన్’ జనవరి 9న రిలీజ్ కానుండగా.. శివ కార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ జనవరి 10న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాలు రాజాసాబ్‌కు లైన్ క్లియర్ చేశాయి. ఎందుకంటే.. ‘జన నాయగన్’ సినిమా రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను వాయిదా వేసింది. దాంతో తమిళనాడులో విజయ్ సినిమాకు ఇచ్చిన థియేటర్స్ ను రాజాసాబ్ కు కేటాయించేసారు. ఇక శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ తమిళ్‌లో రిలీజ్ అయినా.. తెలుగులో థియేటర్స్ సమస్య కారణంగా.. జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి రాజాసాబ్‌కు ఎదురే లేదని చెప్పొచ్చు. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు మొదటి రోజు కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

Exit mobile version