The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise : ఇంటర్వెల్‌కే థియేటర్ షేక్ అవుతుందా? సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నా, నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గురించి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే భారీ బడ్జెట్, విభిన్నమైన కాన్సెప్ట్, పవర్ఫుల్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్క సీన్ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘దసరా’తో దర్శకుడిగా తన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి మరింత భారీ స్థాయిలో ‘ది ప్యారడైజ్’ను తెరకెక్కిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాత్రల పరిచయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూనే ఉన్నాయి.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను దర్శకుడు ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారట. కథను ఒక్కసారిగా కొత్త మలుపు తిప్పేలా, ప్రేక్షకులకు గూస్బంప్స్ వచ్చే స్థాయిలో ఈ సన్నివేశాన్ని రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసే ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో నాని పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నాని, మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. అయితే ప్రస్తుతం ఇంటర్వెల్ సీన్ గురించి వస్తున్న సమాచారం అధికారికంగా రాకపోయినా, ఇండస్ట్రీలో సెట్స్ నుంచి వస్తున్న వార్తలు చూస్తుంటే ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఈ ఇంటర్వెల్ బ్లాక్ నిజంగానే ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం నాని అభిమానుల చూపంతా ఈ ప్రతిష్టాత్మక చిత్రంపైనే నిలిచింది.
Also Read
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!