NTV Telugu Site icon

Salaar: మోస్ట్ అవైటెడ్ పోస్ట్ వచ్చేసింది… సలార్ @ 500 క్రోర్స్

Salaar Collections

Salaar Collections

పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. మొత్తంగా మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్… నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ టాప్ ప్లేస్ లో ఉంది. సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఫైనల్‌గా ఆరు రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. అదే సమయంలో నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సాధించింది. ఇక ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ వీకెండ్ వరకు చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ నైజాం ఏరియాలో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకొని… లాభాల బాట పట్టింది. సంక్రాంతి వరకూ సలార్‌దే హవా ఉంటుంది కాబట్టి… సలార్‌ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్‌ వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీ.

Show comments