టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా
నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ కావడంతో ప్రాజెక్టుపై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ‘NBK111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనుండగా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి : టూ ఇయర్స్ నుండి కనిపించనప్పటికీ నెక్ట్స్ ఇయర్ రప్పాడించేస్తానంటున్నారు. సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారూతో పాటు సమ్మర్‌లో విశ్వంభరను లోడింగ్ చేస్తున్నారు. బాబీతో వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి కొలబరేట్ కాబోతున్నారు చిరు. మెగాస్టార్ 158వ ప్రాజెక్ట్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్‌గా సిద్ధం చేయబోతున్నాడు డైరెక్టర్. అలాగే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు లైన్లో ఉంది.
విక్టరీ వెంకటేశ్ : విక్టరీని ఇంటిపేరుగా మార్చేసుకున్న వెంకటేశ్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ పొంగల్ చూశాడు. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి రీజనల్ హిట్టు కొట్టాడు. దీంతో ఆచితూచి స్టెప్స్ వేస్తున్న వెంకీ మామ నెక్ట్స్ గురూజీ త్రివిక్రమ్‌ని లైన్లో పెట్టాడు. ఈ ఆగస్టులో సినిమా స్టార్టైంది. ఇది కూడా నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతకన్నా ముందే మన శంకర్ వరప్రసాద్‌లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు వెంకీ.
అక్కనేని నాగార్జున : హీరో నుండి విలన్ రోల్స్‌కు షిఫ్టయ్యారు మన్మధుడు నాగార్జున. కుబేర, కూలీ రెండింటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్.. హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్ట్స్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్ తో సినిమా ఉండబోతుందని ఎనౌన్స్ చేశారు కానీ.. పట్టాలెక్కలేదు. అయితే లెటెస్టుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఈయన కూడా దసరా సీజన్‌లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని మొమరబుల్గా మార్చుకునేందుకు మనం తరహాలో సన్స్ చైతూ, అఖిల్ కూడా యాడ్ కాబోతున్నారన్నది టాక్. ఇది కూడా నెక్ట్స్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఈ స్టార్ హీరోలు నలుగురు 2026లో కనిపించబోతున్నారు.
