“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అయితే తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిసినట్టు? పవన్, అభిషేక్ కాంబోలో ఏదైనా సినిమా రాబోతోందా ? అనే చర్చ మొదలైంది.
Read Also : Hari Hara Veeramallu: తోట తరణికి పవన్ కళ్యాణ్ హార్ధిక స్వాగతం!
“డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం, ఆయనతో సుదీర్ఘమైన సంభాషణ జరపడం చాలా ఆనందంగా ఉంది. #PSPK” అని పవన్‌తో భేటీ అనంతరం అభిషేక్ ట్వీట్ చేశారు. కాగా “ది కాశ్మీర్ ఫైల్స్” సూపర్ సక్సెస్ అయినందుకు అభిషేక్ కి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఈ సమావేశం సాధారణమైనదేనని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరిద్దరి కాంబో సెట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Pawan 2
