కమల్ హాసన్ హీరోగా భారీ బజ్డేట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా ముంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను చూసింది.
Also Read : Simran Kaur : హాట్ ఫొటోస్ తో సెగ పుట్టిస్తున్న సిమ్రన్ కౌర్
ఇంతటి భయంకరమైన ప్లాప్ అయిన ఇండియన్ 2 కు సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రోమో జత చేసి మరి ప్రకటించాడు దర్శకుడు శంకర్. కానీ ఇండియన్ 2 ప్లాప్ కారణంగా ఇక పార్ట్ 3 అనేది జరగని పని అనుకున్నారు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేసేందుకు సుముఖంగా లేడు, అటు లైకా కూడా శంకర్ తో సినిమా చేయదు అనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 షూట్ జరుగుతోందట. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాదని కేవలం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తారని కూడా వినిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో శంకర్ సతమతమవుతున్నాడు. ఇండియన్ 3 స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ గా చేసి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఎటొచ్చి బడ్జెట్ దగ్గరే తేడా కొడుతుంది. మరి ఇండియన్ 3ను లైకా ఎలా తీసుకువస్తుందో చూడాలి.