NTV Telugu Site icon

Dragon : ఒకే ఒక హిట్టుతో ఆ హీరోయిన్ లైఫ్ టర్న్

Kayadu Lohar

Kayadu Lohar

స్టార్ హీరోయిన్ కావాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ లక్ కొంత మందిని మాత్రమే వరిస్తుంది. ఒకరికి ఒక్క సినిమాతోనే వస్తే మరికొంత మందికి ఆరేడు సినిమాల తర్వాత ఐడెంటిటీ వస్తుంది. అస్సామీ బ్యూటీ సెకండ్ టైప్. నాలుగేళ్లలో ఐదు ఇండస్ట్రీలు తిరిగితే ఆరో మూవీతో కానీ ఫోకస్ కాలేదు. అదే ప్రదీప్- అశ్వత్ మారిముత్తు డ్రాగన్. డ్రాగన్‌తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు ఈ ఏడాది హండ్రెడ్ క్రోర్ వసూలు చేసిన హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.

Also Read : Retro : ‘రెట్రో’ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పటి హీరోయిన్

డ్రాగన్‌లో అమ్మడి ఫెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన దర్శక, నిర్మాతలు తమ నెక్ట్స్ సినిమాల్లో ఆమెకు ఛాన్సిస్తున్నారు. ఒక్క మూవీతో సరిపెట్టేసిన ఇండస్ట్రీ సైతం ఇప్పుడు పిలిచి ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజెంట్ తమిళంలో అధర్వతో ఇదయం మురళిలో నటిస్తోంది ఈ నయా సెన్సేషన్. ఈ సినిమాతో పాటు కయాద్ చేతిలో అరడజను వరకు సినిమాలున్నాయి. మలయాళ హీరో జయరామ్ సన్ కాళిదాస్ హీరోగా తెరకెక్కుతోన్న నిలవరుమ్ వేలయ్ మూవీకి కమిటయ్యింది. శ్రీవిష్ణు అల్లూరి తర్వాత తెలుగులో కనిపించని ఈ అమ్మడికి  బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. విశ్వక్ సేన్ ఫంకీతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న పిక్చర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అలాగే నివిన్ పౌలీ తారంలో కూడా వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్. ఇవే కాకుండా తమిళంలో ఓ బడా హీరో సినిమాలో హీరోయిన్ కోసం ఈమెనే సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇది కూడా ఓకే అయిపోతే.. ఈ ఏడాది డైరీ ఫుల్ అయినట్లే. మరీ మేడమ్ ఏ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ దక్కించుకుంటుందో ఫ్యూచర్ విల్ బి డిసైడ్.