Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips The Gray Man Will Get A Sequel

The Gray Man: ‘ది గ్రే మాన్’ చిత్రానికి సీక్వెల్!

Published Date :July 27, 2022 , 5:01 pm
By Omprakash Vaddi
The Gray Man: ‘ది గ్రే మాన్’ చిత్రానికి సీక్వెల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

The Gray Man will get a sequel

ఇటీవల 92 దేశాల్లో విడుదలై అనూహ్య స్పందన లభించిన ‘ది గ్రే మాన్’ చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. పాపులర్ ఫిల్మ్ వెబ్ సైట్ ‘రాటెన్ టమాటోస్’ లో 91% ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న ఈ చిత్రం సీక్వెల్ ర్యాన్ గోస్లింగ్, దర్శకులు జో – అంథోని రూసో కాంబినేషన్ లో సిద్ధమవుతుంది. రూసో బ్రదర్స్, ఎజిబిఓ మైక్ లారొక్క తో పాటు జో రోత్, జెఫ్రె కిర్షెన్ బామ్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘ది గ్రే మాన్’ చిత్రానికి పని చేసిన కో- రైటర్ స్టీఫెన్ మక్ఫీలీ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. పాపులర్ స్క్రీన్ రైటర్స్ పాల్ వెర్నిక్, రెట్ రీస్ ‘ది గ్రే మాన్’ ప్రపంచంలో మరో కొత్త కోణం చూపించబోతున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు.

ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ, ” ‘ది గ్రే మాన్’ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల అంచనాలను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన పాత్రలున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్ లా కొత్త గూఢచారి ప్రపంచంలా చేయాలన్న ఆలోచన మాకెప్పటి నుండో ఉంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ ని, అలాగే మేం త్వరలో ప్రకటించబోయే మరో చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సిద్ధమవ్వడం ఆనందంగా అనిపిస్తోంది” అని చెప్పారు. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ స్కాట్ స్టూబర్ మాట్లాడుతూ, ”రూసో బ్రదర్స్, ఎబిజిఓ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ‘ది గ్రే మాన్’ చిత్రంతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇచ్చారు. అదే నేపథ్యంలో వారితో మరిన్ని చిత్రాలకోసం ఫ్రాంచైస్ ని మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. ‘ది గ్రే మాన్’ సిరీస్ మార్క్ గ్రేనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anthony Russo
  • Joe Russo
  • Ryan Gosling
  • The Gray Man
  • The Gray Man sequel

తాజావార్తలు

  • Mani Sharma : నా ‘హార్మొనీ’ దుమ్ము పట్టిపోయింది.. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్!

  • Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!

  • Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం..!

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions