NTV Telugu Site icon

Manchu Family : మంచు కుటుంబంలో చల్లారని మంటలు

Manchu

Manchu

మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య మంటలు చల్లారలేదు. నిన్న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక చేసేదేమి లేక యూనివర్సీటి పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ దంపతులు వెనుదిరిగారు.

Also Read : Manchu Family : మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ కారుపై దాడి

నిన్న జరిగిన ఘటనపై ఇరు వర్గాలలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంబియు దగ్గర అడ్డుకున్న ఘటనపై ఇవాళ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడు మంచు మనోజ్. కోర్టు తీర్పు ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని మనోజ్ పై నిన్న ఫిర్యాదు చేసిన మంచు మోహన్ బాబు. సంక్రాంతి సంధర్బంగా తాత, నానమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు ఎంబియు’కు వచ్చిన మనోజ్ ఫ్యామిలీ అడ్డుకున్న ఎంబియు సిబ్బంది, బౌన్సర్లు,  ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ‘ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి నేను ఒక్క డిని చాలు వారికి సమాధానం చెప్పడానికి’ అంటూ మనోజ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విష్ణు అనుచ రులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై దాడి చేసారు. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్ పై పోలీసులకు  మోహాన్ బాబు ఫిర్యాదు  చేయడంతో నేడు  మోహన్ బాబు పై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదుచేయబోతున్నాడు మనోజ్. మరి ఈ మంచు వారి మంటలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.

Show comments