ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ సక్సెస్ సాధించగా, ఇప్పుడు మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ వేచిచూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్‌డేట్‌తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ, ‘శ్రీకాంత్ తివారీ తిరిగి వచ్చాడు!’ అంటూ అనౌన్స్ చేసింది.
Also Read : ‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పాయ్ మళ్లీ శ్రీకాంత్ తివారీగా కనిపించనున్నారు. థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ (TASC) అధికారి అయిన శ్రీకాంత్ ఈసారి మరింత ప్రమాదకరమైన మిషన్‌లోకి దిగుతాడట. అంతేకాదు, అతడి ఫ్యామిలీ లైఫ్‌లో కూడా కొత్త సవాళ్లు ఎదురవుతాయని మేకర్స్ తెలిపారు. రాజ్–డీకే మాట్లాడుతూ, “ఈ సీజన్‌లో శ్రీకాంత్ టీమ్ ఎదుర్కొనే ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి. అదే సమయంలో ఆయన కుటుంబంలో జరిగే సంఘటనలు కూడా భావోద్వేగంగా ఉంటాయి” అని చెప్పారు. ఈ సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి, షరీబ్ హష్మి , ఆశ్లేష ఠాకూర్ , శరద్ ఖేల్కర్ , సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే గుల్‌పనాగ్, శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందూజా, అభయ్ వర్మ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పుడు మిగిలింది ఒక్కటే – శ్రీకాంత్ తివారీ కొత్త మిషన్ ఏంటి? ఈసారి ఎవరి మీద యుద్ధం ప్రారంభించబోతున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే నవంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే.
