కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమిత బైజు ముఖ్య పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమా ఆడియో లాంచ్ గత రాత్రి మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగింది. దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని ఫెస్టివల్ రేంజ్‌లో నిర్వహించారు మేకర్స్. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య దళపతి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ గా జననాయగన్ నిలిచింది. ఫైనల్ గా అభిమానుల కోసం ఈ ఈవెంట్ లో ‘దళపతి కచేరి’ సాంగ్ కు డాన్స్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు విజయ్.
Also Read : Naga Vamsi : కింగ్డమ్ ప్లాప్.. దర్శకుడిపై విమర్శలు చేసిన నిర్మాత నాగవంశీ
పొలిటిక ల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో నే లాస్ట్ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలు వదిలేసి పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ గా మారనున్నాయి. ఇప్పటికే TVK పార్టీ పేరుతో రాజకియా సమావేశాలు నిర్వహిస్తున్నాడు విజయ్. ఈ నేపథ్యంలోనే సినిమాలకు స్వస్తి పలకబోతున్నాడు విజయ్. చాలా ఏళ్లుగా తమిళ స్టార్ హీరోగా అగ్ర స్థాయిలో అభిమానులను అలరించించిన విజయ్ సినిమాల నుండి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. విజయ్ సినిమాల నుండి తప్పుకోవంతో కోలీవుడ్ సినిమా చరిత్రలో స్టార్ హీరో శకం ముగిసినట్లయింది. తమ హీరో చివరి సినిమాను భారీగా సెలెబ్రేట్ చేయాలని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న జననాయగన్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది.. విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. #JanaNayaganAudioLaunch #JanaNayagan #ThalapathyVijay #ThalapathyKacheri
— SubbaRao kilari (PRO) (@ProSubbarao) December 28, 2025
