NTV Telugu Site icon

Kalki 2898 AD: ఓ ధనుంజయ.. వచ్చింది సూర్యపుత్ర కర్ణ.. పూనకాలు తెప్పిస్తున్న కర్ణుడి ఎంట్రీ

Karna

Karna

Prabhas In Suryaputra Karna: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చుసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్​లో “కల్కి 2898 ఏడీ” సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. ద్వాపర యుగంలో ఇతిహాసాలు వాటినుంచి వెలువడిన పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్‌ హీరోగా, నాగ్ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లే ఆ అంచనాలను చేరుకున్నాడనడంలో సందేహంలేదు. సినిమా ప్రారంభమే మహాభారత ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. అశ్వద్ధామకు శ్రీకృష్ణునికి ఈ మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ఈ సినిమా మొదట్లోనే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా విజయ దేవరకొండ నటించగా ప్రభాస్ కర్ణుడి కారెక్టర్ లో ప్రత్యక్షమవుతాడు.

Also Read: Kalki 2898 AD: కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల పూనకాలు

మహాభారతం లో అశ్వద్ధామకి అర్జునుడి కి యుద్ధం జరుగుతుండగా అశ్వద్ధామ, అర్జునుడిని ఓడించలేకపోతాడు. చావుబ్రతుకుల మధ్య ఉన్న అశ్వద్ధామ పైన అర్జునుడు నిన్ను ఇంకా ఎవరు కాపాడలేరు ని పైన నేను బ్రహ్మాస్తర్ ప్రయోగిస్తున్న ఇప్పటివరకు దీన్ని ఎవరు ఆపలేదు అన్నపుడు ఒక యోధుడు బాణం వచ్చి ఆ బ్రహ్మాస్తర్ ఢీ కొడుతుంది దానితో రెండు అడుగులు అర్జునుడి రథం వెనక్కి జరుగుతుంది. తరువాత అర్జునుడు ఇంకో బాణం ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ యోధుడి రథం 10 అడుగులు వెన్నకి వెళుతుంది. అప్పుడు అర్జునుడు చూసావా కృష్ణ మనం రథం రెండు అడుగులు వెన్నకి వెళ్తే తన రథం 10 అడుగులు వెన్నకి వెళ్ళింది ఇతను నాకు పోటీనా అంటాడు. వెంటనే కృష్ణుడు ఓ ధనుంజయ ని రథం అగ్నిదేవుని వరం కాపాడుతుంది జెండాపైన కపిరాజు నడుపుతుంది ముల్లోకాలు నడిపించే నేను అయినా రెండు అడుగులు వెన్నకి తోసాడు అంటే ఆలోచించు అర్జునా తాను సామాన్య యోధుడు కాదు తన కళ్ళలో సూర్యుడు తేజస్సు చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు తన పేరు చరిత్ర మర్చిపోదు తన పేరు “సూర్యపుత్ర వైకర్తన కర్ణ” అన్న ఎంట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది.