సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్‌రూమ్‌లో పాడటం మనం చూడొచ్చు. ఇంటర్ (11 & 12వ తరగతి) చాలా కీలకమని, డిస్టింక్షన్ స్కోర్ చేస్తే, బ్యాంకు ఉద్యోగాలు సులువుగా సాధించవచ్చని లెక్చరర్ విద్యార్థులకు తెలియజేస్తున్నారు.
Read Also : Bheemla Nayak : పిక్ తో రూమర్స్ కు చెక్… పని పూర్తి చేసిన డైరెక్టర్
“మీరు ఫస్ట్ క్లాస్ మార్కులను స్కోర్ చేయగలిగితే బ్యాంక్ సేవలు, ఆర్ఆర్బీ వంటి మరికొన్ని పరీక్షలకు అర్హత సాధించవచ్చు. ఒక్క సారి ఉద్యోగం వచ్చింది అనుకో… ఒక వందో.. ఒక వెయ్యో… ఒక లక్షో..” అని లెక్చరర్ చెప్పడంతో విద్యార్థులు వెంటనే అరుపులతో క్లాస్ రూమ్ లో సందడి చేశారు. ఇక లెక్చరర్ విద్యార్థులను శాంతింపజేసి మీకు ఉద్యోగం వస్తే కళావతి రాదు, కానీ సరస్వతి మీ తలుపులు తడుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి లెక్చరర్ స్పాంటేనిటీని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ‘సర్కారు వారి పాట’ టీం కూడా ఈ వైరల్ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
