పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి,సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.
Also Read : Tollywood : ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన టాలీవుడ్ దర్శకులు.. ఇప్పుడు హిట్ కోసం అష్టకష్టాలు..
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న బెగ్గర్ టీమ్ తాజాగా మన శంకర వరప్రసాద్ ను కలిసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. ఈ నేపద్ద్యంలో మెగాస్టార్ టీమ్ ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు పూరి అండ్ టీమ్. చిరును కలిసిన వారిలో విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్, ఛార్మి, సంయుక్త మీనన్ తో పాటు చిత్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చిరు అండ్ టీమ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్ గా మారింది. ఇక మన శంకర వరప్రసాద్ చివరి షెడ్యూల్ ను త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుసుకువస్తున్నారు. అటు పూరి విజయ్ సేతుపతి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ పై వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో రిలిజ్ చేయనున్నారు.
