NTV Telugu Site icon

Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు

Pradeep

Pradeep

ప్రదీప్ రంగనాథన్‌‌హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. హీరోగా తోలి సినిమాతోనే  ప్రదీప్ రంగనాథన్‌‌ సూపర్ హిట్ కొట్టడమే కాకండా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇప్పుడు తాజాగా మరొక యంగ్ డైరెక్టర్ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో  ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Also Read : Dil Ruba : కిరణ్ కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా దిల్ రూబా ప్రీమియర్స్.

ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల మార్క్ ను టచ్ చేసేందుకు పరుగులు పెడుతుంది. ఇప్పటికీ కూడా 70 పర్సెంట్ ఆక్యుపెషన్ తో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి చేస్తోంది. డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరు మీదున్నాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్ సినిమా లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ (LIK) పై అంచనాలు పెరిగాయి. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను నయనతార నిర్మిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది.  అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మొదటి రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడంతో  ఇప్పుడు ప్రదీప్ నెక్ట్ టార్గెట్ రూ. 200 కోట్లగా మారిపోయింది. LIK ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఆ ఫీట్ సాదించడం అంత కష్టమేమి కాదు.