Dil Ruba : కిరణ్ కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా దిల్ రూబా ప్రీమియర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.
Also Read : Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
Also Read
“క” వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మార్చి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. కృషార్జున యుద్ధం సినిమాలో నటించిన రుక్సాన్ తిల్లాన్ ఈ సినిమాతో హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇస్తానని ధీమాగా ఉంది ఈ భామ. కాగా ఈ సినిమా పట్ల చిత్ర హీరో కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిన్న కిరణ్ అబ్బవరం మరియు అతని స్నేహితులు, కొందరు సన్నితులతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో సినిమా చూసుకున్నారు. అనంతరం దిల్ రూబా ను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా అనగా 13 రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయ్యాడు. అప్పట్లో ‘క’ కి కూడా ముందే ప్రీమియర్స్ వేసాడు కిరణ్. దిల్ రూబా ప్రీమియర్స్ నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!