NTV Telugu Site icon

Sandal Wood : ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా మారిన యంగ్ హీరో

Dakshitshetty (1)

Dakshitshetty (1)

బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన మరో టాలెంట్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ షోల్లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మొనగాళ్లు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియదు కానీ కెరీర్ మొత్తాన్ని మార్చేసింది దసరా. సూరీ పాత్రలో నానికి ధీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద సైమా అవార్డ్ కూడా అందుకున్నాడు.

Also Read : Kollywood : అందని ద్రాక్ష కోసం అరడజను సినిమాలు..

దసరా తర్వాత కన్నడలో కేటీఎం, బ్లింక్ సినిమాలు వచ్చాయి కానీ సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా దీక్షిత్ శెట్టి ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. చెప్పాలంటే ఇప్పుడు మరింత దూకుడు పెంచాడు. లైనప్ పెంచుకుంటున్నాడు. యంగ్ హీరోల్లో దీక్షిత్ రేంజ్‌ ఆఫర్లు కొల్లగొట్టిన హీరో మరొకరు లేరనే చెప్పొచ్చు. ఒకటా రెండా ఏడు సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ పోకస్ పెట్టాడు. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా కనిపించబోతున్నాడు దీక్షిత్. అలాగే కింగ్, జాకీ, క్వీన్ చేస్తున్నాడు కన్నడ హీరో. కన్నడలో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు సెట్స్ పై ఉండగా జ్  స్ట్రాబెరీ, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ కంప్లీట్ చేశాడు. అలాగే మలయాళంలోనూ ఊప్స్ అనే మూవీ చేస్తున్నాడు దీక్షిత్. ఏడాది క్రితం ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు శాండిల్ వుడ్ హీరో. రామ్ వెంకట్ అనే దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఇలా ఫుల్ బిజీలో ఉన్న దీక్షిత్.. నెక్ట్స్ బాలీవుడ్ ను టార్గెట్ చేసేట్లే కనిపిస్తున్నాడు.