Tharun Bhascker: ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేయగా ఈరోజు ఈ సినిమాను సమర్పిస్తున్న రానా దగ్గుబాటి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ దాస్యం కొన్ని పంచ్ లు వేశారు. ముందుగా మీడియా ప్రతినిధులు మీరు సినిమాలు డైరెక్ట్ చేయకుండా ఎందుకు నటన మీద ఫోకస్ పెడుతున్నారు? అనే విషయాన్ని గట్టిగా ఫోకస్ చేయగా అది తన తీట అని ఆయన చెప్పుకొచ్చారు.
Tiger Nageswara Rao: చివరి నిమిషంలో ‘టైగర్’కి టైమొచ్చింది!
Also Read
అంతేకాక ఎందుకు సురేష్ బాబు గారి కాంపౌండ్ లోనే ఉండిపోయారు, ఆయనతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని అడిగితే తనకు సురేష్ అనే పేరు కలిసి వచ్చిందని అన్నారు. న్యూమరాలజీ, నమ్మే తాను సురేష్ అనే పేరు ఉన్న వారితో ఎవరితో అయినా సినిమాలు చేస్తానని అన్నారు. సురేష్ కొండేటితో కూడా సినిమాలు చేస్తానని అన్నారు. అలాగే నటన మీదనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అడిగితే దానికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టు అయిన సురేష్ కొండేటి డాన్స్ చేయవచ్చు కానీ డైరెక్టర్ అయిన నేను సినిమాల్లో నటించకూడదా ? అని ప్రశ్నించారు. అంతేకాక తాను జర్నలిస్టుగా అవ్వాలని అనుకుంటున్నానని కోర్సు చేసి వస్తానని కూడా ఆయన కామెంట్ చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!