Site icon NTV Telugu

Tammudu: ‘భూ భూతం..’ అంటున్న తమ్ముడు

Nithin Bhutham

Nithin Bhutham

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read:Samantha: ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సమంత అసహనం

ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘భూ అంటూ భూతం..’ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ పరిశీలిస్తే కనుక మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఉంది. ‘భూ అంటూ భూతం..’ పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు.

Also Read:Rajasaab- Peddi -War-2 : రాజాసాబ్, పెద్ది, వార్-2 టీజర్లు.. ఏది ఎక్కువ..?

సింహాచలం మన్నేలా లిరిక్స్ రాసిన ఈ ‘భూ అంటూ భూతం..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Exit mobile version