Site icon NTV Telugu

Thaman : అప్పుడు “సారొస్తారా”… ఇప్పుడు “కళావతి”

Thaman

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. ఆయన ఇటీవల మ్యూజిక్ అందించిన “అఖండ”, “భీమ్లా నాయక్” సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి విడుదలైన పాటల మేనియా నడుస్తోంది. ‘పెన్నీ సాంగ్’, ‘కళావతి’ సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ ఫ్లాష్ మోబ్ లో “కళావతి” మేనియా అంటూ ఓ వీడియోను షేర్ చేస్తూ తమన్ ను ట్యాగ్ చేశాడు.

Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం

ఆ వీడియో చూసిన తమన్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. “2012లో సారొస్తారా సాంగ్… 2022లో కళావతి సెన్సేషనల్” అంటూ ట్వీట్ చేశారు తమన్. 2012లో మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ మూవీలో ‘సారొస్తారా’ సాంగ్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తరువాత మహేష్, తమన్ కాంబోలో వచ్చిన మరో సాంగ్ ‘కళావతి’ కూడా అంతే సెన్సేషనల్ కావడం విశేషం. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న విడుదల కానుంది.

Exit mobile version