స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ రోజు ఉదయం ఒక శుభవార్తను పంచుకున్నారు. తన నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలో తేజ్ ను కలవబోతున్నాను అని వెల్లడించాడు. “మీ ప్రార్థనలన్నీ పని చేస్తున్నాయి. నా నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన నన్‌బన్‌ను కలవడానికి వెళ్ళబోతున్నాను. నాకు చాల సంతోషంగా ఉంది” అంటూ థమన్ ట్వీట్ చేశారు.
Read Also : “రిపబ్లిక్” ఫస్ట్ రివ్యూ
మరోవైపు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’కు దేవ కట్టా దర్శకత్వం వహించారు. దీనిని జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ పాత్రలో నటించగా, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రిపబ్లిక్’ చిత్రం 2021 అక్టోబర్ 1 న విడుదల కానుంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం ఒక బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10 న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఆటోను ఓవర్‌టేక్ చేస్తూ బైక్‌పై జారి పడ్డాడు. ఈ ఘటన ఆరోజు రాత్రి 7:30 గంటలకు జరిగింది. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్ మామ, మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రమాదం తప్పిందని తెలియజేశారు. ఇటీవల చిరంజీవి ‘రిపబ్లిక్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసి సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అన్నాడు.
