“రిపబ్లిక్” ఫస్ట్ రివ్యూ

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని సినిమాను చూసేసాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాపై తన అభిప్రాయం ఏంటో కూడా ఇందులో వెల్లడించాడు. “రిపబ్లిక్ చూసాను… సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగొచ్చింది. అది మరింత స్ట్రాంగ్ గా ‘రిపబ్లిక్’ రూపంలో తిరిగి వస్తోంది. ఈ సినిమాతో దేవాకట్టా తిరిగి ఇంతకు మునుపు ఫామ్ లోకి వచ్చాడు. టీం కు అభినందనలు” అంటూ నాని ట్వీట్ చేశారు.

Read Also : ఈవెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య… వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఈ సోషల్ డ్రామా అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. సెప్టెంబర్ 9న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన యాక్సిడెంట్ కారణంగా తేజ్ తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. ఆసుపత్రి బెడ్ పై ఉన్న తేజ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.తేజ్ త్వరలోనే కోలుకుంటాడని మెగా ఫ్యామిలీ చెబుతోంది.

-Advertisement-"రిపబ్లిక్" ఫస్ట్ రివ్యూ

Related Articles

Latest Articles