Site icon NTV Telugu

‘అఖండ’పై కీలక అప్డేట్ ఇచ్చిన థమన్

Thaman

Thaman

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్‌ ను జారీ చేసింది. మరోవైపు శరవేగంగా జరుగుతున్న సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్‌స్టాగ్రామ్‌ లో ‘అఖండ’కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌ ఎంత వరకు వచ్చింది అనే విషయాన్ని ఈ పోస్టులో వెల్లడించాడు.

Read Also : తగ్గేదే లే అంటున్న ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్… ట్వీట్ తో ఫుల్ క్లారిటీ

ఈ మేరకు “అఖండ” దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఉన్న పిక్ ను థమన్ పంచుకున్నారు. ఈ చిత్రం చివరి దశ డాల్బీ అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఇటీవల విడుదలైన “అఖండ” థియేట్రికల్ ట్రైలర్‌లో థమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా నిలిచింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఔట్ అండ్ అవుట్ మాస్ మ్యూజికల్ ట్రీట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అఖండ’ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

View this post on Instagram

A post shared by Thaman Shivakumar Ghantasala (@musicthaman)

Exit mobile version