సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దుమ్మురేపేద్దాం అంటూ మెగా పవర్ ఫ్యాన్స్ ను హూషారెత్తించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “వకీల్ సాబ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “పిఎస్పీకే రానా” సినిమాలో మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పుకొచ్చాడు తమన్. “పిఎస్పీకే రానా” చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ 15 ఆగస్టు 2021న స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది.
Read Also : కాంట్రవర్సీ క్వీన్ తో హాలీవుడ్ స్టార్ మూవీ
ఈ నేపథ్యంలో తమన్ ఇన్‌స్టాగ్రామ్‌లో భీమ్లా నాయక్ పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ “దుమ్ము దులుపుదాం” అని అన్నారు. దీంతో మెగా అభిమానుల్లో జోష్ మరింత రెట్టింపు అయ్యింది. రీసెంట్ గా మహేష్ టీజర్ రిలీజ్ కు ముందు “బ్లాస్టర్” అని చెప్పి నిజంగానే బ్లాస్ట్ చేసి చూపించాడు. మరి ఈ సినిమా విషయంలో కూడా తమన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. రేపు టైటిల్‌పై సస్పెన్షన్ కూడా క్లియర్ కానుంది. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా కొనసాగుతోంది. ఆగష్టు నెలాఖరులోగా టీమ్ మొత్తం షూట్ పూర్తి చేసే అవకాశం ఉంది. తరువాత పవర్‌స్టార్ “పిఎస్పీకే 28”, “హరి హర వీరమల్లు” కోసం షూటింగ్ ప్రారంభించనున్నారు.